నర్సీపట్నం, జూలై 27:( సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి) '' జగనన్నే మా సీఎం.. గణేష్ అన్న మా ఎమ్మెల్యే.. వైయస్సార్సీపి పాలనే మళ్లీమళ్లీ మాకు కావాలి" అంటూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నర్సీపట్నం 22వ వార్డు పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కి ప్రజలు ఘన స్వాగతం పలికారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 22 వార్డులో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్న నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ కు మహిళలు వీర తిలకం దిద్ది, హారతులతో స్వాగతించారు. స్థానిక ప్రజలు బాణాసంచాతో పండగ వాతావరణాన్ని సృష్టించారు. ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు సన్మానాలు చేశారు. రామాలయం, ఆంజనేయుడు ఆలయాలలో ఎమ్మెల్యే గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే గణేష్ ప్రతి ఇంటి కి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను తెలుసుకుంటూనే ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఆయన తెలియజేస్తూ ముందుకు సాగారు. ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెనువెంటనే అధికారుల తో చర్చించి పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు. స్థానికులు రోడ్లు , డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కొందరు కోరారు. జగనన్న సచివాలయాలు కన్వీనర్ 14వ వార్డు ఇన్చార్జ్ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ ఆయన్ని సన్మానించారు. అత్యంత ఉత్సాహంగా గడపగడపకు మన ప్రభుత్వం వార్డులో కొనసాగుతున్నది. ఎమ్మెల్యే తో పాటు.. నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి, 22వ ఇంఛార్జి పెట్లా నాయుడు,అయ్యరక కార్పోరేషన్ డైరెక్టర్ కర్రి కనక మహాలక్ష్మి, షిరిడీ సాయి దేవస్థానం నిర్వాహకులు కర్రి రాంగోపాల్, సీనియర్ వైసీపీ నాయకుడు నాని , వైస్ చైర్మన్ లు తమరాన అప్పలనాయుడు, కోనేటి రామకృష్ణ, జగనన్న సచివాలయాల కన్వీనర్ తమరాన శ్రీను, ముస్లిం సంచార జాతుల స్టేట్ డైరెక్టర్ చోటి , మున్సిపల్ కౌన్సిలర్లు వీరమాచినేని జగదీశ్వరి , సిరస పల్లి నాని, కో ఆప్షన్ కౌన్సిలర్ షేక్ రోజా, ఎండి భాష, వైసిపి మహిళ విభాగం టౌన్ అధ్యక్షరాలు గణమ్మ, , కార్యదర్శి లలిత, వైసిపి నాయకులు కొణతాల వరలక్ష్మి, కనితి అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మళ్ళ గణేష్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గొలుసు నర్సింహమూర్తి, దనిమిరెడ్డి నాగు ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ శారద, దనిమిరెడ్డి ప్రసాద్, టౌన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏకాశివ, కనకదుర్గ దేవస్థానం చైర్మన్ సతీష్, దేవత అరుణ, యాదగిరి శేషు, మున్సిపల్ కమిషర్ కనాకరావు, టౌన్ ఎస్ ఐ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments