ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి పర్యాటకులకు బంద్ సెగ తగిలింది . ఆదివాసుల హక్కులు చట్టాలు సమర్థవంతంగా బలపర్చాలని జాయింట్ యాక్షన్ కమిటీ సోమ మంగళ వారాలు బందుకు పిలుపునిచ్చింది.ఈ సమాచారం తెలియని పర్యాటకులు సోమవారం ఉదయం ఐదు గంటలకే వ్యక్తిగత వాహనాలు, ప్రైవేటు వాహనాల్లో లంబసింగి చేరుకున్నారు .అయితే బంద్ కారణంగా లంబసింగి పరిసర ప్రాంతాల్లో దుకాణాలు తెరుచుకోలేదు. కనీసం అల్పాహారం కూడా లభించే పరిస్థితి లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు . ఇదిలా ఉండగా వాహనాలు ఎక్కడికక్కడ ఆందోళనకారులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పర్యాటకులు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో బంద్ కారణంగా మంగళవారం లంబసింగి సందర్శించాలని భావించే పర్యాటకులు తమ పర్యటనను వాయిదా వేసుకోవడం మంచిదని ఆందోళనకారులు తెలియజేశారు .
1 Comments
మీ వార్తలు మై న్యూస్(బ్రేకింగ్ న్యూస్) లో ప్రచురితం కావాలంటే feedbackmynews@gmail.com ఫొటోస్ వివరాలు పంపించండి మేము ప్రచురిస్తాం .
ReplyDelete