పాడేరు మే 5 (వి.డేవిడ్):సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలో శుక్రవారం నిర్వహించిన స్పందనలో 73 అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఐటిడిఏ పి ఓ వి. అభిషేక్ , వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. భూ వివాదాలు, తాగునీటి సమస్యలు, రహదారులు, విద్యుత్ సౌకర్యం వంటి సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు మాట్లాడుతూ స్పందన సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటిడిఏ పి ఓ వి. అభిషేక్ మాట్లాడుతూ గిరిజన సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పారు. జిల్లా అధికారులు స్పందనకు హాజరు కానప్పుడు స్పందనపై అవగాహన ఉన్న దిగువ శ్రేణి అధికారులను స్పందనకు పంపించాలని సూచించారు.
స్పందనలో స్వీకరించిన ఫిర్యాదులు
• అరకు వ్యాలీ మండలం బొండాం పంచాయతీలోని పివిటిజి గ్రామాలైన రంగిని పాడు,
రేగ,కరకవలస, కొరియాగుడ, జయంతి వలస, రంపుడు వలస, బలియగూడ గ్రామాలకు రోడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని సర్పంచ్ దురియా భాస్కర రావు వినతిపత్రం సమర్పించారు.
• చింతపల్లి మండలం లబ్బంది కొత్తవీధి గ్రామంలో ప్రేమాకరరావు భార్య భారం మీనాక్షికి తన భూమిని లీజుకి ఇచ్చానని తనకు తెలియ కుండా తప్పుడు పత్రాలతో భూమిని రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని దానిని నిలుపదల చేయాలని కేదరి వెంకట స్వామి
ఫిర్యాదు చేసారు.
• హుకుంపేట మండలం కొట్నాపల్లి గ్రామానికి చెందన సిందికోడి మోహన్ బాబు పి.యం. ఇ. జి.పి. పథకం కింద కోళ్లు, గెర్రెలు పెంచుకొనుటకు రుణం మంజూరు చేయాలని
వినతిపత్రం అందజేసారు.
• కొయ్యూరు మండలం నల్లగొండ పంచాయతీ బొయఊట, కొత్తవీధి గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, ఆశ కార్యకర్తను నియమించాలని గ్రామస్తులు
పి.నాగేశ్వరరావు, పి. భీమరాజు వినతి పత్రంలో కోరారు.
• జి. మాడుగుల మండలం పెదవలస గ్రామస్తులు జి.రాంబాబు, గెమ్మిలి వెంకటరావు ఎన్టీ ఆర్ గృహ పథకంలో ఇళ్లు నిర్మించి నాలుగేళ్లు గడిచినా బిల్లులు మంజారు కాలేదని ఫిర్యాదు చేసారు.
• డుంబ్రిగుడ మండలం సొవ్వ గ్రామానికి చెందిన గొర్లియ వరజమ్మ తన కుమారుడు జి. షణ్ముఖ్ వరుణ్ సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడుతున్నాడని సికిల్ సెల్ ఎనిమియా పింఛన్ మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డి. ఆర్. ఓ , పి. అంబేద్కర్, వివి ఎస్ శర్మ, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ. కొండల రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సి. జమాల్ భాషా, గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ కె. వేణుగోపాల్, రహదారులు భవనాల శాఖ ఇఇ బాల సుందర బాబు, డి పి ఓ కొండల రావు, డి. ఎల్ పి ఓ పి ఎస్ కుమార్, ఐటిడి ఏ పరిపాలనాధికారి హేమలత తదితరులు పాల్గొన్నారు.
0 Comments