ముత్యాలమ్మ జాతర లో పారదర్శకతకు పెద్దపీట వేసిన ఉత్సవ కమిటీ..అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

చింతపల్లి, ఏప్రిల్ 20(ఆనంద్):
ముత్యాలమ్మ జాతర నిర్వహణ లో ఉత్సవ కమిటీ పారదర్శకతకు పెద్దపీట వేసింది. ఎన్నడూ లేని విధంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దురియ హేమంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి పోతురాజు బాలయ్య, కోశాధికారి పసుపులేటి వినాయకరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెదిరెడ్ల బేతాళుడు, కార్యదర్శి తాటిపాకల రమేష్, కమిటీ సభ్యులు అహర్నిశలు శ్రమిస్తూ జాతర విజయోత్సవానికి ఎనలేని కృషి చేస్తున్నారు. ఉత్సవ కమిటీ సేకరిస్తున్న చందాల వివరాలను వాట్సాప్ ముత్యాలమ్మ గ్రూపులో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ పారదర్శకతకు నాంది పలికారు. దీంతో చింతపల్లి పట్టణ ప్రజలు ఉత్సవ కమిటీ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 అమ్మవారి పండగను పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి సలహాలు, సూచనలు, సహకారంతో ముందుకు నడిపిస్తున్న ఉత్సవ కమిటీని పలువురు అభినందిస్తున్నారు. ఈ ఏడాది విద్యుత్ ద్వీపాల అలంకరణ పరిధిని విస్తరిస్తూ ఆకర్షనీయంగా ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సబ్ జైలు వేదికల వద్ద ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు కేక పెట్టిస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ ఇదే స్థాయిలో అమ్మవారి పండగ విజయానికి ఉత్సవ కమిటీ క్రియాశీలక పాత్ర పోషించాలని, ఈ ఏడాది ఉత్సవ కమిటీ సేవలను మర్చిపోలేని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Post a Comment

0 Comments