పాడేరు ఏప్రిల్ 12 (వి.డేవిడ్): ఐటిడిఏ నూతన ప్రాజెక్టు అధికారిగా వి. అభిషేక్ బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారులు వి. ఎస్. ప్రభాకర్ రావు, ఎం. వేంకటేశ్వరరావు, పరిపాలనాధికారి హేమలత పుష్ఫగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఐటిడిఏ కార్యాలయం అధికారులు, సిబ్బంది నూతన పిఓ కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. జమాల్ భాషా, పి.హెచ్ఓ అశోక్, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ. కొండల రావు, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ డివిఆర్ఎం రాజు, కేర్ అధికారి శుభ్రమణ్యం, డిఆర్డిఏ పిడి మురళి, ఎస్ డిసి శర్మ, పలువురు తాహశీల్దారులు, రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసారు.
అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తనమీద ఉంచిన నమ్మకానికి అనుగుణంగా గిరిజనులకు ఉత్తమ సేవలందిస్తానని చెప్పారు. రెండు సంవత్సరాలుగా ఏజెన్సీలో సేవలందిస్తున్నానని చెప్పారు. గిరిజన ప్రాంతంపై అవగాహన ఉందని అన్నారు. అందరి సహకారంతో అభివృధ్ధి చేస్తానని అన్నారు. జిల్లా కలెక్టర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనమీద నమ్మకంతో పి ఓ బాధ్యతలు అప్పగించారని ఆమేరకు గిరిజనాభివృధ్ధికి అంకిత భావంతో పని చేస్తానన్నారు.అంతక ముందు ఐటిడిఎ గార్డెన్ లో మొక్కలు నాటారు.
0 Comments