స్వగ్రామం ఆదివాసీలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు వైసీపీ మండల అధ్యక్షుడు మోరి రవి చేసిన భగీరథ ప్రయత్నం ఫలించింది. తాగునీటి పథకం ఏర్పాటు చేయాలనె చిరకాల కల నెరవేరింది. మోరి రవి కృషి ఫలితంగా రత్నగిరి కాలనీకి రహదారి సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇక తమ గ్రామంలో రక్షిత మంచినీటి పథకం నిర్మిస్తే తమ నీటి కష్టాలు తీరుతాయని స్థానిక గిరిజనుల అభ్యర్థన మేరకు మండల అధ్యక్షుడు రవి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ని ఒప్పించి గ్రామానికి రూ 20 లక్షల జేజేఎం నిధులను విడుదల చేయించుకున్నారు. మంచినీటి పథకం నిర్మాణ పనులు పూర్తి కావడంతో శుక్రవారం ఎంపీపీ కోరాబు అనూష దేవి ప్రారంభించారు. గ్రామస్తుల దాహార్తిని తీర్చేందుకు కృషి చేసిన మోరి రవికి స్థానిక మహిళలు కృతజ్ఞతలతో ముంచేత్తుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత ఎంపీటీసీ సభ్యురాలు మీనా కుమారి పాల్గొన్నారు.
0 Comments