చింతపల్లి:
చింతపల్లి మండలం కస్తూర్బా గాంధీ ఉన్నత పాఠశాల, కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థినులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మటం పార్వతమ్మ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 6, 7,8,9 తరగతి లతోపాటు ఇంటర్మీడియట్ ఎంఇసి ప్రథమ సంవత్సరం లో ప్రవేశం పొందేందుకు ఏప్రిల్ 20వ తేదీలోగా web site వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అన్నారు. కేజీబీవీలో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందన్నారు. పూర్తి సమాచారం కోసం 8309333206 నంబర్ ని సంప్రదించాలని ఆమె తెలిపారు.
0 Comments