మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళలకు ప్రత్యేక పోటీలు.. ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్

నర్సీపట్నం, ఫిబ్రవరి 15(సీనియర్ జర్నలిస్ట్ బిఎల్ స్వామి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని  "స్టార్ వనిత" "పరిపూర్ణ మహిళ" అనే రెండు విభాగాల్లో మహిళలకు ఉత్తేజపరిచేందుకు పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షురాలు, నర్సీపట్నం మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి, ప్రోగ్రాం కన్వీనర్ దేవాడ సత్యనారాయణ తెలియజేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్  పోటీలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. మార్చి 8వ తేదీన మహిళలకు ఆటలు,  క్విజ్  పోటీలు,  ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు  ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి రూ. పదివేలు, ద్వితీయ బహుమతి రూ.8000, తృతీయ బహుమతి రూ. 6000 నగదు బహుమతులను అందజేస్తామన్నారు.  మహిళలందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నమన్నారు. ఆసక్తి గల మహిళలు పూర్తి సమాచారం కోసం 9398634198, 9849534024 నంబర్ కి కాల్ చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ప్రచార పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శారద, కృష్ణ దేవి పేట సర్పంచ్ సుజాత, వినాయక దేవస్థానం చైర్ పర్సన్ అరుణ, కౌన్సిలర్ కోనేటి రామకృష్ణ, వైసిపి టౌన్ అధ్యక్షుడు ఏకాశివ, వైసిపి నాయకులు యాదగిరి శేషు తదితరులు పాల్గొన్నారు. 


Post a Comment

0 Comments