మార్చి 13న ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికకు పోలింగ్..నేడే ఎన్నికల నోటిఫికేషన్:డిఆర్ఓ అంబేద్కర్

*ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి
*జిల్లాలో ఓటర్లు 11,571
పాడేరు, ఫిబ్రవరి 16(వి.డేవిడ్):
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గానికి మార్చి 13న ఎన్నిక జరగనుందని జిల్లా రెవెన్యు అధికారి పి.అంబేద్కర్ తెలిపారు.  ఈ నెల తొమ్మిదవ తేదీన ఎన్నికలకు సంబంధించి ప్రకటన వెలువడినందున ఆ రోజు నుండి ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమలులోకి వచ్చిందని, ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహించాలని సూచించారు. 

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ జారీ చేస్తారని, ఆ రోజు నుండి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 24 న నామినేషన్ల పరిశీలన అనంతరం 27 వ తేదీ లోగా నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువని వివరించారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని, మార్చ్ 16న ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. 

జిల్లాలో పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి 11,571 మంది ఓటర్లుగా నమోదయ్యారని, అందులో 7,894 పురుష ఓటర్లు, 3,674 మంది మహిళా ఓటర్లు ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారని వివరించారు.  జిల్లాలో వీరికోసం 14 పోలింగ్ బూత్లు ఉండగా మరో అనుబంధ పోలింగ్ బూత్ ఏర్పాటు చేయటంతో మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 

Post a Comment

0 Comments