చింతపల్లి ఫిబ్రవరి 25(ఆనంద్): మన్యం ప్రజల ఆరాధ్య దైవమైన దొంతులమ్మ జాతర ఈ నెల 27 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతరకు సంబంధించిన పోస్టర్లను లోతుగడ్డ జంక్షన్ వద్ద ఉత్సవ కమిటీతో కలిసి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర విజయవంతనికి ప్రతి ఒక్కరు పూర్తి సహకారం అందించాలన్నారు. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పంచాయితీ, రెవెన్యూ ,పోలీస్, మండల పరిషత్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ఈనెల 28న జరిగే రామ డోలి వైభవాన్ని ప్రజలందరూ తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోరాబు అనూష దేవి, సర్పంచ్ వంతల మహేశ్వరి, ఉప సర్పంచ్ గెమ్మెలి రవి, చింతపల్లి ఎంపీటీసీ సభ్యురాలు దాసరి ధార లక్ష్మీ పద్మ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కోరాబు అంగద రావు, ఆలయం చైర్మన్ కవేర్ల రామారావు, పూజారి గణపతి కమిటీ సభ్యులు సదాశివ, నారాయణరావు పాల్గొన్నారు.
0 Comments