దొంతులమ్మ జాతరకు చురుగ్గా ఏర్పాట్లు.. రామ డోలి ఉయ్యాల నిర్మించిన గూడ వీధి యువత..

చింతపల్లి ఫిబ్రవరి 25(ఆనంద్)ఆదివాసుల ఇష్ట ఆరాధ్య దైవమైన దొంతులమ్మ జాతర నిర్వహణకు ఉత్సవ కమిటీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నది. జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఈ నెల 13 నుంచి ఉత్సవ కమిటీ ప్రారంభించింది. ఇప్పటికే రామడోలికి అవసరమైన చెక్క స్తంభాలను వంతమామిడి, పాలడా నుంచి భక్తులు భక్తిశ్రద్ధలతో 60 అడుగుల పొడవు కలిగిన మామిడి వృక్షాలను భుజాలపై మోసుకుంటూ అమ్మవారి కొండ వద్దకు చేర్చారు. తాజాగా గూడవీధి యువత  రామడోలి నిర్వహణకు అవసరమైనటువంటి ఉయ్యాలను రెండు రోజులు శ్రమించి సిద్ధం చేశారు. 

Post a Comment

0 Comments