ఈనెల 16వ తేదీన శ్రీ నల్ల మారమ్మ తల్లి ఆలయంలో భారీ అన్న సమారాధన

మాకవరపాలెం, ఫిబ్రవరి 15(సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ బిఎల్ స్వామి):అనకాపల్లి జిల్లా  మాకవరపాలెం మండలం కొండలఅగ్రహారం గ్రామం శ్రీ నల్ల మారమ్మ తల్లి ఆలయంలో ఈనెల 16వ తేదీన భారీ అన్న సమారాధన నిర్వహించనున్నట్టు ఆలయ ధర్మకర్త గూడూరు వెంకటరాజు తెలియజేశారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. సర్ప  నది  తీరంలో వెలసిన శ్రీ నల్ల మారమ్మ తల్లి జాతర మహోత్సవాలు సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసామన్నారు. అమరావతి ట్రావెల్స్ యజమానులు వాడపల్లి  సన్యాసిరాజు (పెద్ద), వాడపల్లి వెంకటరాజు (చిన్న ),సహకారంతో ఈ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని చెప్పారు.
 5000 మంది భక్తులకు  ఇక్కడ భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్న సమారాధన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ పెద్దలు, ప్రజల సహాయ సహకారాలతో ప్రతి ఏటా అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నమన్నారు. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తున్నమన్నారు. జాతరలో విద్యుత్ దీపాల అలంకరణ, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా తో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త వెంకట రాజు తెలిపారు.


Post a Comment

0 Comments