ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..సచివాలయం వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించిన సీఎం :నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్

నర్సీపట్నం(విఎస్ జె ఆనంద్) జనవరి 4: రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. బుధవారం నర్సీపట్నంలో గ్రామ వాలంటీర్లతో నియోజకవర్గం ఇన్ చార్జీ మల్ల విజయప్రసాద్ అధ్యక్షతన ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాలనను గ్రామస్థాయికి తీసుకువచ్చి ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం లక్ష్యంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సీఎం అమలులోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించారని అన్నారు. గ్రామ సచివాలయం వ్యవస్థ వల్ల ప్రజలకు మెరుగైన ప్రభుత్వ పాలన అందుతుందన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు తమ పరిధిలోనున్న అర్హులను గుర్తించి ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందజేస్తున్నారన్నారు. నాడు టిడిపి ప్రభుత్వ హయాంలో వృద్ధులు దివ్యాంగులు పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయాల్లో బారులు తీరాల్సిన దుస్థితి నీ ఎదుర్కొనే వారన్నారు. నేడు జగన్ పాలన లో నెలలో మొదటి రోజే వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు నిద్రలేవక ముందే వాలంటరు ఇంటికి వచ్చి పింఛన్ అందజేసేందుకు తలుపు తడుతున్నాడన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన ఎవరికి సాధ్యం కాదన్నారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హత కొలమానంగా తీసుకొని ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నారన్నారు. నాటి రోజుల్లో జన్మభూమి కమిటీలు సిఫారసు మేరకు అతి తక్కువ మందికే పింఛన్లు అందజేసే వారిని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వానికే చెందుతుంది అన్నారు. గ్రామ వార్డు వాలంటీర్లకు గ్రామంలో ఒక గుర్తింపును వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని, ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఆయన కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే నర్సీపట్నం మున్సిపాలిటీ, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం మండలాల వైసీపీ పార్టీ ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశం అయ్యారు.

Post a Comment

0 Comments