రీ సర్వే వల్ల పూ యజమానులకు శాశ్వత హక్కు పత్రాలు అందరూ ఉన్నాయని, భూ వివాదాలకు అవకాశం ఉండదని జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. బుధవారం ఆమె మునగపాక మండలంలో పర్యటించారు. రెవెన్యూ అధికారులు చేపడుతున్న భూ రిస్ సర్వే ను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె రైతులతో మాట్లాడుతూ.. భూ రీసర్వే వల్ల ఖచ్చితమైన సరిహద్దులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ సర్వే డిజిటలైజేషన్ కావడం వల్ల భవిష్యత్తులో భూవివాదాలు తలెత్తే అవకాశం ఉండదన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించడం జరుగుతుందన్నారు. భూ రీ సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని ఆమె తెలిపారు. రెవెన్యూ అధికారులు భూ రీ సర్వేలో వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునగపాక తహసిల్దార్ బాబ్జి , రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
0 Comments