నవోదయ మోడల్ పరీక్షలో గోల్డ్ మెడల్ సాధించిన నాడేలి బిందు శ్రీ

పాడేరు(వి.డేవిడ్):
జవహర్ నవోదయ మోడల్ పరీక్ష లో ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న ఓ విద్యార్థిని గోల్డ్ మెడల్ సాధించింది.  ఆదివారం మోదమాంబ పాఠశాలలో  నవోదయ మోడల్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఎటువంటి కోచింగ్ లేకుండానే జి.మాడుగుల మండల కేంద్రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని నాడేలి బిందు శ్రీ 75 మార్కులు సాధించింది. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని కి నిర్వాహకులు గోల్డ్ మెడల్ అందజేశారు. నాడేలి బిందుశ్రీ  నాలుగోవ తరగతి చదువుతుంది. మోడల్ పరీక్షలో గోల్డ్ మెడల్ సాధించిన బిందు శ్రీని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. 

Post a Comment

0 Comments