గిరి విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే: నియోజకవర్గ టిడిపి ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

*గిరిజన విద్యార్థుల వరుస
మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలి
*మరణించిన గిరి విద్యార్థులకు ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఒక ఉద్యోగం ఇవ్వాలి
*ఐటీడీఏ పీవో మొండివైఖరి మానుకోవాలి
*ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటరీలను నియమించాలి
*గిరిజనుల పక్షాన ఏ పోరాటం చేసిన దానికి టిడిపి పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుంది
పాడేరు( వి. డేవిడ్):
ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థి విద్యార్థినిల వరుస మరణాలు ముమ్మటికి ప్రభుత్వ హత్యలే నని పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.పాడేరు ఐటీడీఏ  వద్ద విద్యార్థి,గిరిజన, మహిళ, కార్మిక, ప్రజా సంఘాల వేదిక 16రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు, 4వ తేదీన జరుగునున్న మహాధర్నకు మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గిరిజన విద్యార్థుల వరుసమరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని,మరణించిన గిరి విద్యార్థులకు ఎక్స్గ్రేషియా 10 లక్షలు కుటుంబానికి ఒక్క ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటరీలను నియమించాలని,స్థానిక ఐటీడీఏ పీవో రోణంకి గోపాల కృష్ణ మొండివైఖరి మానుకోవాలన్నారు.గిరిజన ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తూ, గిరిజన ప్రజాప్రతినిధులను హేళన చేస్తున్న పాడేరు ఐటిడిఏ పి.ఓ రోణంకి గోపాలక్రిష్ణను ప్రభుత్వం సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు.గిరిజన ఉద్యోగుల అక్రమ సస్పెండన్ను రద్దుచేయాలి. పెదబయలు తహాశీల్దార్ మృతిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని,ఇంటర్, డిగ్రీ గిరిజన విద్యార్థులకు ట్యూషన్, ఎగ్జామినేషన్, అడ్మిషన్ ఫీజులను ఐటిడిఏ చెల్లించాలన్నారు.విద్యార్థి, ప్రజాసంఘాలను అలాగే మీడియా ప్రతినిధులను గిరిజన విద్య సంస్థలలో ప్రవేశాన్ని నిరాకరిస్తూ గిరిజన సంక్షేమ ముఖ్యకార్యదర్శి జారీచేసిన సర్క్యులర్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గిరిజనుల పక్షాన ఏ పోరాటం చేసిన దానికి తెలుగుదేశం పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందన్నారు. దురదృష్టకరమైంటంటే స్థానిక ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ఇంటి ముందు ఉన్న పాఠశాలలో ఒక విద్యార్థి మరణిస్తే ఆమెకు చీమ కొట్టినట్టు కూడా లేదని విమర్శించారు. విద్యార్థి మరణాలపై కనీసం ఎంపీ ఎమ్మెల్యేలు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. గిరిజనుల పైన ఎంత ప్రేమ ఆప్యాయత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్య నిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు బుక్క జగదీష్, మండల తెలుగు యువత అధ్యక్షులు డుంబేరి విశ్వనాథం,    సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ కూడ రాధాకృష్ణ, కన్వీనర్ .ప్రభుదాస్, చిన్నరావు ,బత్తిరి నరేష్, చిన్నరావు, గిరిజన సంగం నాయకులు లక్కు పి, మహిళా సంఘం నాయకులు చిన్న, రాణి,లత,విమల,రవణమ్మ, మాణిక్యము,వరల్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments