తెలుగుదేశం పార్టీ పాడేరు నియోజకవర్గం ఇన్ చార్జీ , మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తల్లి గిడ్డి పార్వతమ్మ వర్ధంతిని ఆదివారం కుమ్మరిపుట్టు తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. పార్వతమ్మ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని కుమ్మరి పుట్టు వద్ద పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి షటిల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ కు 32 జట్లు పేర్లను నమోదు చేసుకున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు ప్రధమ బహుమతి గా రూ.10,000, ద్వితీయ బహుమతి గా రూ. 5,000 రూపాయలు అందించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గిడ్డి ఈశ్వరి నివాసగృహంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments