ఇద్దరు ఉపాధ్యాయులకు ఒకరోజు జీతం నిలుదలు చేస్తూ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సోమవారం మలక పొలం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలను పి ఓ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎస్జీటీలు జి సిద్దేశ్వర రావు, డి .సూరిబాబు విధులకు హాజరు కాలేదని ఒకరోజు జీతం నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఫేషియల్ అటెండెన్స్ ప్రతిరోజు అప్రూవల్ చేయడం లేదని ప్రధానోపాధ్యాయుడు శంకర్రావుకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు.147 మంది విద్యార్థులు గాను 112 మంది హాజరయ్యారని డ్రాప్ ఔట్ లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులకు వ్యాకరణాన్ని బోధించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సక్రమంగా రూపొందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి క్లాస్కు హెల్త్ లీడర్లను నియమించాలని సూచించారు. ఉపాధ్యాయుల కాంటాక్ట్ నంబర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలలో ఉన్న కూలర్, సోలార్ హీటర్ మరమ్మత్తులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు. కొంతమంది విద్యార్థులు బూట్లు వేసుకోలేదని పరిశీలించి సక్రమమైన సైజుల బూట్లను విద్యార్థులకు పంపిణీ చేయాలని ఎంఈఓ నాదేశించారు. వంట్లమామిడి, అయినాడ, దేవాపురం, సలుగు సచివాలయాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి స్పందన రిజిస్టర్ లను సక్రమంగా నిర్వహించాలని సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. తమ సమస్యలను సచివాలయం పరిధిలోనే పరిష్కరించడానికి సచివాలయం సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
0 Comments