పాడేరు ఎమ్మెల్యే శ్రీమతి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
పాడేరు వి.డేవిడ్) డిసెంబర్ 25:
పాడేరు మాజీ శాసనసభ్యులు కొట్టగుళ్లి చిట్టి నాయుడు సేవలు చిరస్మరణీయమని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఆదివారం చిట్టి నాయుడు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ తమర్భ నర్సింగ రావు, వైఎస్ఆర్సిపి శ్రేణులు పూలమాలల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాడేరు శాసనసభ్యులు మాట్లాడుతూ పాడేరు నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. నిబద్ధతగల వ్యక్తికి ప్రతిరూపం నాన్నగారు స్వర్గీయ కొట్టగుళ్లి చిట్టి నాయుడు అని ఆమె అభివర్ణించారు. గిరిజన పక్షాన నిలిచిన ఆయన ఆశయాలను సాధిస్తామని పేర్కొన్నారు. గిరిజనుల అభ్యున్నతి కోసం నాన్న గారు ఏ విధంగా అయితే నిరంతరం కృషి చేశారో తాను కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ ఆదివాసీల అభ్యున్నతి కోసం పని చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టగుళ్లి నాయుడు గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
0 Comments