ఈ నెల18న జరగాల్సిన రియల్ టైం స్టేటడిస్ (RTS) సమావేశం 23వ తేదీకి మార్పు: తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

పాడేరు(వి. డేవిడ్):
ఈ నెల18వ తేదీన జరగాల్సిన రియల్ టైం స్టేటడిస్(RTS) నియోజకవర్గ స్థాయి సమావేశం 23వ తేదీకి మార్చడం జరిగిందని పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 19తేదీన అమరావతిలో చంద్రబాబుతో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ప్రతి నియోజకవర్గం ఇన్చార్జిలు విస్తృత స్థాయి సమావేశం ఉండటం వలన ఈ 18వ తేదీన జరగాల్సిన సమావేశం 23 కి వాయిదా వేయడం జరిగిందన్నారు. 23వ తేదీన జరిగేటటువంటి రియల్ టైం స్టేటడిస్ (RTS) సమావేశనికి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల మండల అధ్యక్షులు, మండల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని ఆమె సూచించారు. ఈ సమావేశం కుమ్మరిపుట్టు పార్టీ కార్యాలయం ముందు జరుగుతుందని ఆమె తెలియజేశారు.

Post a Comment

0 Comments