ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్:"ప్రజా సంకల్ప యాత్ర" ఐదేళ్ల సంబరాల్లో పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి

పాడేరు (వీ.డేవిడ్):
ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని పాడేరు శాసనసభ్యులు  కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో భాగంగా జగన్  చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటికి ఐదేళ్ల పూర్తయిన సందర్భంగా పాడేరు లోని పాత బస్టాండ్ వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాడేరు శాసనసభ్యులు  కోటగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జరిగాయి. ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్ల పూర్తయిన సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైయస్సార్ కుటుంబులను ఉద్దేశించి భాగ్యలక్ష్మి మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గిరిజన ప్రాంతానికి వచ్చినప్పుడు  ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిన ఏకైక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి  నిలిచారని ఆమె తెలిపారు.  బాక్సైట్ రద్దుకు సంబంధించినటువంటి 97వ జీవో, పాడేరుకు రూ. 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ ఏర్పాటు, లక్షలాది మంది రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ లో  ముఖ్యమంత్రి  ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చారన్నారు. నాడు- నేడు పేరుతో విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పు ఓ విప్లవంగా పేర్కొన్నారు. 341 రోజులు పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసి 3,648 కిలోమీటర్లు దూరం ప్రయాణించి ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేడు పరిష్కారానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనన ఆమె పేర్కొన్నారు. 
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సొనారి రత్నకుమారి, వైస్ ఎంపీపీ కనకాలమ్మ, సర్పంచులు సిదరి రాంబాబు, ఎంపీటీసీలు కుతాంగి సూరిబాబు, సర్పంచులు గబ్బాడ చిట్టిబాబు, లకే పార్వతమ్మ, ఎంపీటీసీలు నరసింహమూర్తి , చిట్టెమ్మ, వ్యవసాయ మండల చైర్మన్ సరస్వతి, పసుపుల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ బొంజుబాబు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments