చంద్రబాబు సమీక్ష సమావేశంలో పాడేరు టిడిపి ఇంచార్జి గిడ్డి ఈశ్వరి....అఖండ విజయంతో గెలిచి రావాలని ఆశీర్వదించిన చంద్రబాబు

పాడేరు(వి. డేవిడ్): 
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గల సమీక్ష సమావేశంలో భాగంగా బుధవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  వన్ ఆన్ వన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన చట్టాలు అక్కులు జీవోలు కాపాడుటలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని ఆయన అన్నారు. వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామస్థాయిలో ఇంటింటికి తెలియజేయాలన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణ నిలుపుదలకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుందని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పాడేరు నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అభినందనలు తెలియజేశారు. పాడేరు నియోజకవర్గం లో అఖండ విజయంతో గెలిచి రావాలని ఈశ్వరి ని చంద్రబాబు ఆశీర్వదించారు.

Post a Comment

0 Comments