విద్యార్థులు బాగా చదవాలి – ఆంగ్ల భాష పై ప్రత్యేక దృష్టి సారించండి:జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

పాడేరు(వి. డేవిడ్):- విద్యార్థులు బాగా చదవాలని, ఆంగ్ల భాషపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు.  బుధవారం పాడేరు మండలం కొత్తాబు, బర్సింగి, డొకులూరు, బొడ్డు మామిడి గ్రామాలలో స్థానిక శాశన సభ్యులు కే. భాగ్యలక్ష్మి తో కలసి పర్యటించారు.  ముందుగా గబ్బంగి పంచాయతి కొత్తాబు చేరుకున్న కలెక్టర్ అక్కడ జిల్లా కలెక్టర్ నిధులు రూ.1.50 లక్షలు, మండల పరిషత్ నిధులు రూ. 1.50 లక్షలతో కలిపి మూడు లక్షల రూపాయలు వినియోగించి గ్రామస్తులు శ్రమ దానంతో పునర్నిర్మించిన పాటశాల, అంగన్వాడి భవనాన్ని శాసన సభ్యులుతో కలసి ప్రారంభించారు.  పాటశాల విద్యార్ధి ఒకరు కలెక్టర్ చిత్రపటాన్ని పెన్సిల్ డ్రాయింగ్ చేసి కలెక్టర్ కు బహూకరించటoతో కలెక్టర్ ఆ విద్యార్ధి ప్రతిభకు మురిసిపోయి ఆ విద్యార్ధిని దగ్గరకు తీసుకుని అభినందించారు.  అదేవిధంగా తలసేమియా తో భాద పాడుచున్న ఆరు సంవత్సరాల చిన్నారి సీదిరి దీక్షిత కు మూడు నెలల పాటు ఫించన్ వచ్చి తరువాత రావటం లేదని తెలుసుకున్న కలెక్టర్ క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.  వివరాలు అందజేస్తే సి ఎఫ్ ఎం ఎస్ అధికారులతో చర్చించి పెన్సన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. 
బర్సింగి గ్రామంలో జిల్లా కలెక్టర్ నిధులు రూ.2.50 లక్షలు, గ్రామస్తుల శ్రమదానంతో పునర్నిర్మించిన ప్రాధమిక పాటశాల భవనాన్ని కలెక్టర్, శాసన శాభ్యులు ప్రారంభించారు.  భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ మరో విడత పెయింట్స్ ఆకట్టుకునే విధంగా వేయించాలని ఎంపిడిఓ నవీన్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆ భవనంకు గేటు ఏర్పాటుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. 
అనoతరం డోకులూరు చేరుకున్న కలెక్టర్ అక్కడ రూ.130 లక్షలతో, గ్రామస్తుల శ్రమదానంతో పునర్నిర్మించిన భవనాన్ని కూడా శాసన సభ్యులతో కలసి ప్రారంభించారు. అక్కడ ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాటశాల సందర్శించి ఆ ప్రాంగణంలో శాసన సభ్యులతో కలసి మొక్క నాటారు.  కొత్తాబు, బర్సింగి, దొకులూరు లాంటి పాటశాలలు గుర్తించి వివరాలు అందజేయాలని ఎంపిడిఓ నవీన్ ను ఆదేశిస్తూ గ్రామస్తులు సహకారంతో పునర్నిర్మాణ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. 
చివరగా బొడ్డు మామిడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం క్రింద సచివాలయ నిధులు మూడు లక్షల  రూపాయలతో ఆ గ్రామంలో నిర్మిస్తున్న రహదారి నిర్మాణం పనులకు కలెక్టర్ శాసన సభ్యులు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.  సర్పంచ్ రాంబాబు విజ్ఞప్తి  మేరకు ఆ గ్రామం నుండి ప్రహాన రహదారికి మిషన్ కనెక్ట్ పాడేరు కింద మంజూరుకు గల అవకాశాలు పరిశీలిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. 
ఈ పర్యటనలో పాడేరు ఎంపిడిఓ నవీన్, ఎంపిపి ఎస్. రత్నకుమారి, ఆయా పంచాయతీల సర్పంచులు ఎస్. రాంబాబు, బి. చిట్టిబాబు, ఎ. సన్నిబాబు, జి. నీలకంఠo,  వి. రాంబాబు, ఎంపిటిసిలు  డి. సన్యాసి రావు, చిట్టమ్మ, పార్వతమ్మ, కే. కనకలమ్మ, మాజీ ఎంపిపిలు మంగందొర, రమణమూర్తి, ఎంఇఓ సరస్వతి, ఆయా పాటశాలల ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments