గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డులను అందుకున్న కలెక్టర్ సుమిత్ కుమార్, పిఓ గోపాల క్రిష్ణ

పాడేరు, నవంబర్ 28(వి.డేవిడ్):  అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల క్రిష్ణ రాష్ట్రస్థాయి అవార్డు( ఉత్తమ సేవా పురస్కారం) అవార్డులను గవర్నర్ విశ్వ భూషణ్ హరిచంద్ చేతుల మీదుగా అందుకున్నారు. జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గిరిజనులకు అందిస్తున్న సేవలకు మంచి గుర్తింపు లభించింది. విస్తృతంగా నిర్వహిస్తున్న రక్త దాన శిబిరాలు, రక్త సేకరణలను పురష్కరించుకొని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల కృష్ణ లకు పురష్కారం అభించింది.  ఈ మేరకు సోమవారం రాజ్ భవన్ లో నిర్వ హించిన రెడ్ క్రాస్ అవార్డు ను రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు  బిశ్వ భూషణ్ హరి చందన్ చేతుల మీదుగా కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ద్వారా అందిస్తున్న సేవలకు గాను కలెక్టర్ , ప్రాజెక్ట్ అధికారులను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.  భవిష్యత్తులో మరింత విస్తృతంగా  రెడ్ క్రాస్ సేవలను అందించాలని, రక్త నిల్వలను పెంపొందించాలని గవర్నర్ సూచించారు.  జిల్లా కలెక్టర్, ప్రాజెక్ట్ అధికారి అభ్యర్ధన మేరకు జిల్లాకు రెడ్ క్రాస్ గ్రాంట్ నుండి మహా ప్రస్తానం అంబులెన్సును మంజూరు చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. పేదలకు సేవలు అందించటానికి మహా ప్రస్తానం వాహనాన్ని వినియోగించాలని సూచించారు.  
వచ్చే నెలలో  పాడేరు ఐటిడిఎ పరిధిలో నిర్వహించనున్న మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాల కు హాజరు కానున్నట్లు గవర్నర్ తెలిపారు. 2020 – 21 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ గా సుమిత్ కుమార్ రెడ్ క్రాస్ తరపున  శ్రీకాకుళం జిల్లాలో  అందించిన విస్తృత సేవలను, రక్తదానాన్ని ప్రోత్సహించి  రక్తదాన శిభిరాలు ఏర్పాటుకు ఆయన  చేసిన కృషిని  గుర్తించి రెడ్ క్రాస్ అవార్డుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి  ఆర్ పి సిసోడియా, రెడ్ క్రాస్ జనరల్ సెక్రటరీ ఎకే పరీడా తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments