చింతపల్లిలో శీతల గిడ్డంగి ఏర్పాటు చేయాలి వ్యవసాయ మిషన్ చైర్మన్ నాగిరెడ్డికి వినతి పత్రం అందజేసిన ఎం పీపీ అనుషదేవి

వ్యవసాయ మిషన్ చైర్మన్ నాగిరెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న ఎం పీపీ అనుషదేవి

చింతపల్లి, అక్టోబరు 13:(వి. డేవిడ్ )
మండలంలో శీతల గిడ్డంగి ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకోవాలని ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్ నాగిరెడ్డికి స్థానిక ఎం పీపీ కోరాబు అనుషదేవి వినతి పత్రం అందజేశారు. గురువారం చింతపల్లి వచ్చిన వ్యవసాయ మిషన్ చైర్మన్ని కలిసి ఆమె రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. గిరిజన రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు భద్రపర్చుకునేందుకు శీతల గిడ్డంగిలేకపోవడం వల్ల పంటలనే నేరుగా వర్తకులకు తక్కువ ధరకు విక్రయించుకుని నష్టపోతున్నారని ఆమె వివరించారు. శీతలగిడ్డంగి ఉంటే రైతులు పండించిన పసుపు, అల్లం, మిరియాలు భద్రపర్చుకుని మంచి ధర వచ్చినప్పుడు విక్రయించుకునే అవకాశముంటుందని ఆమె తెలిపారు. అలాగే పసుపు, మిరియాలు, అల్లం పంటలకు గిట్టుబాడు ధర కల్పించాలని ఆమె కోరారు. అలాగే జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య పలు సమస్యలపై చైర్మనికి వినతి పత్రం అందజేశారు.


Post a Comment

0 Comments