జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా జమిల్ భాష...పుష్పగుచ్ఛం లతో స్వాగతించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

పాడేరు,అక్టోబర్ 18( వి .డేవిడ్): 
అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డిఎంఅండ్ హెచ్ఓ) గా డాక్టర్ జమిల్ భాష మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తాజా పదోన్నతుల్లో డిప్యూటీ సివిల్ సర్జన్ పనిచేస్తున్న జమిల్ భాషని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన విధుల్లో చేరారు. డిఎం అండ్ హెచ్వో గా బాధ్యతలు స్వీకరించిన జమిల్ భాషని జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ విశ్వేశ్వర నాయుడు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లీల ప్రసాద్ ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎపిడమిక్ సెల్ విస్తరణ అధికారి సింహాద్రి పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments