కొమరం భీమ్ కు ఘన నివాళులర్పించిన పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి

 
పాడేరు, అక్టోబరు 22:(వి. డేవిడ్)
గిరిజన ఉద్యమ నాయకుడు కొమరం భీమ్ జయంతి సందర్భంగా పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఘనంగా నివాళులర్పించారు. పాడేరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిరిజనులకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ  గోండు తెగకు చెందిన కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడారని కొనియాడారు. అటవి జాతుల జీవనోపాధికి దెబ్బతీసే అన్ని రకాల నిజాం అధికారాలను తోసుకొచ్చాడని అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేతబట్టారని పేర్కొన్నారు. పశువుల కాపరులకు విధించిన సుంకానికి వ్యతిరేకంగా తమ భూమిపై తమదే అధికారం అని "భూమి- అడవి- నీరు మాదే" అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందిన పోరాట యోధుడని భాగ్యలక్ష్మి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సొనరి రత్నకుమారి,  సర్పంచ్ రాంబాబు, ఎంపీటీసీలు చిట్టెమ్మ,  నరసింహమూర్తి, లకే రామకృష్ణా పాత్రుడు, సీనియర్ నాయకులు రమణమూర్తి, ఎంపిటిసి విజయలక్ష్మి , బొంజు బాబు, కన్నా పాత్రుడు, మంగ్లన దొర, బసవన్న దొర, కొడ సుశీల, దశమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments