పాడేరు(వి.డేవిడ్):గాంధీ జయంతిని పురస్కరించుకుని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పాడేరు శాసన సభ్యులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలను ఆమె కొనియాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం వైసీపీ పార్టీతోనే సాధ్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ తమర్భ నరసింగరావు, ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు, సర్పంచ్ లు రాంబాబు, లక్కే పార్వతమ్మ, ఉపసర్పంచ్ సత్యనారాయణ, లక్కే రామకృష్ణ పాత్రుడు, ఎంపీటీసీ సభ్యులు లకే రామకృష్ణ పాత్రుడు, నరసింహమూర్తి, వ్యవసాయ శాఖ జిల్లా సలహామండలి అధ్యక్షులు ఎం సరస్వతి, సీనియర్ నాయకులు ఎస్సీ రమణ, కన్నాపాత్రుడు, సూరిబాబు, ఊర్వశీ రాణి, సుశీల, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
0 Comments