గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చేర్పించాలి.
చింతపల్లి,(వి. డేవిడ్) అక్టోబరు 12:
టీడీపీ బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నికుమారి లక్ష్మి విజయానికి కార్యకర్తలు కృషిచేయాలని పార్టీ అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో టీడీపీ ముఖ్యనాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీపై ప్రజాదరణ పెరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు, నిరుద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. పట్టభద్రులకు నిరుద్యోగ భృతి ఇస్తానని సీఎం జగన్ మోసం చేశారన్నారు. సీపీఎస్ ని వారం రోజుల్లో రద్దుచేస్తానని మాటమార్చి జీపీఎస్ని తెరపైకి తీసుకొచ్చాడన్నారు. వివిధ
శాఖలో ఖాళీగానున్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన విడుదల చేసిందిలేదన్నారు. దీంతో ఉద్యోగులు, నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈనేపథ్యంలో టీడీపీ బలపర్చిన ఎమ్మెల్సీ విజయం తథ్యమని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. గిరిజన ప్రాంతంలో పట్టభద్రులు అత్యధిక సంఖ్యలో ఉన్నారని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా పార్టీ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పార్టీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ఆమె విజయం సాధిస్తే శాసన మండలిలో ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై జగన్ని నిలదీసే అవకాశం కలుగుతుందన్నారు. పట్టభద్రులు టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి లక్ష్మణరావు, అరకు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి బేరా సత్యనారాయణ పడాల్, పార్టీ సీనియర్ నాయకులు రామన్న పడాల్ కవడం రాజేంద్ర, ప్రసాద్ పాల్గొన్నారు.
0 Comments