పేదల ఆకలి తీర్చడమే టిడిపి లక్ష్యం..అన్నా క్యాంటీన్లను అడ్డుకోవడం అధికార పార్టీ దుర్మార్గ చర్య...నియోజకవర్గం పరిశీలకులు కిల్లి వేణుగోపాల స్వామి, మాజీ ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి

*పాడేరులో అన్న క్యాంటీన్ ప్రారంభం
          అన్న క్యాంటీన్ లో భోజనాలు వడ్డిస్తున్న
పాడేరు(వి.డేవిడ్):
పేదల ఆకలి తీర్చడమే టిడిపి లక్ష్యమని, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు అధికార పార్టీ అడ్డుకోవడం దుర్మార్గ చర్య అని నియోజకవర్గం పరిశీలకులు కిల్లి వేణుగోపాల స్వామి, మాజీ ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారం పాడేరులో గిడ్డిఈశ్వరి అధ్వర్యంలో నియోజకవర్గం పరిశీలకులు కిల్లి వేణుగోపాల స్వామి అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అన్న క్వాంటిన్ లో  ప్రజలకు పరిశీలకులు వేణుగోపాలస్వామి గిడ్డిఈశ్వరి భోజనాలు వడ్డించారు.
ఈ సందర్భంగా వేణుగోపాల్ స్వామి, గిడ్డిఈశ్వరి  మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు పేదవాడి ఆకలి తీర్చలనే లక్ష్యంతో అన్న క్యాంటీన్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్ లను  వైసిపి ప్రభుత్వం అడ్డుకునే కార్యక్రమం చేస్తుందని , పేదవాడికి అన్నం పెట్టాలేని దుస్థితిలో రాష్ట్ర వైసిపి ప్రభుత్వం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెడితే రాష్ట్ర వైసిపి ప్రభుత్వనికి అసూయ, బాధ కలుగుతుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా పేదవాడికి అన్న క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టే తీరుతామని, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు ప్రభుత్వం అనందించవలసి పోయి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ లను అడ్డుకునే ప్రయత్నం వైసిపి ప్రభుత్వం చేస్తుందన్నారు.  
రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి అన్నారు.అనంతరం పాడేరు మండలం కుమ్మరి పుట్టు వద్ద పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి, రాష్ట్ర బిసి సెల్ ఉపాధ్యక్షులు పోలుపర్తి గోవిందరావు, రాష్ట్ర తెలుగు యువత  కార్య నిర్వహణ కార్యదర్శి  వెంకట్ సురేష్ కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్  ఉపాధ్యక్దులు సోమేలి చిట్టిబాబు, టిడిపి సీనియర్ నాయకుడు చల్లంగి లక్ష్మణరావు పాల్గొన్నారు. 



Post a Comment

0 Comments