పెరిగిన నిత్యవసర సరుకులు, డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలి :అరకు వ్యాలీ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గొల్లూరి పద్మ

*హాట్టగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా దర్బార్

అరకువ్యాలీ: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెను భారంగా మారిన నిత్యవసర సరుకులు, డీజిల్ పెట్రోల్ ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని అరకు వ్యాలీ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గొల్లూరి పద్మ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని  చిన్నలబుడు పంచాయితీ హట్టగూడ గ్రామంలో అరకు వ్యాలీ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు  గోల్లూరి పద్మ ప్రజాదర్బార్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ, వైసిపి పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  గిరిజన హక్కులు, చట్టాలను హరించివేస్తుంది అన్నారు. గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించే దిశగా ప్రారంభించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తొలగించి గిరిజన విద్యార్థులకు తీరని అన్యాయం చేశాయన్నారు. భాష వాలంటీర్లకు రెన్యువల్ చేయకుండా ఆదివాసి నిరుద్యోగుల ఉపాధికి గండి కొట్టింది అన్నారు.  ఆశ్రమ పాఠశాలలో హెల్తు వాలంటీర్లను నియమించకపోవడం వల్ల ఆదివాసి విద్యార్థులకు సకాలంలో ప్రాథమిక వైద్యం అందడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపి , వైసిపి పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ పార్టీ ప్రజా దర్బార్ గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గొల్లోరి కొండమ్మ గ్రామస్తులు  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments