*అక్షర సైనికులారా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి.
*సంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలకు అతీతం.
*కేవలం సమాజ హితం, సామాజిక బాధ్యత మాత్రమే.
*ఉత్తరాంధ్ర జర్నలిస్టు ఫ్రంట్ అధ్యక్షులు ఎం ఆర్ ఎన్ వర్మ.
చింతపల్లి :- అక్షర సైనికుల ఆరోగ్యమే మహాభాగ్యం గా అల్లూరి జిల్లా పరిధిలోని విలేకరులు, వారి కుటుంబ సభ్యులకు పాడేరు లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంగా ఆదివారం ( సెప్టెంబర్ 18) ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభం కానున్న మెగా ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ప్రతీ జర్నలిస్టు కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఉత్తరాంధ్ర జర్నలిస్టు ఫ్రంట్ అధ్యక్షులు ఎం ఆర్ ఎన్ వర్మ అన్నారు శుక్ర వారం ఆయన మాట్లాడుతూ సమాజ హితం కోసం రేయింబవళ్ళు కల్లై, చెవులై సామాజిక బాధ్యతతో జనం కోసం మనం, గొంతు లేని ప్రజల కోసం గొంతు కై పని చేస్తున్న అక్షర సైన్యానికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలనే చిన్న ప్రయత్నం. పాడేరు విశాలాంధ్ర పాత్రికేయుడు సూర్య నేతృత్వంలో విశాఖకు చెందిన అనూ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించ తలపెట్టిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని అల్లూరి జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్, వెబ్ మీడియా అనే బేదాబిప్రాయాలు లేకుండా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులతో వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ వైద్య శిబిరానికి హాజరైన జర్నలిస్టు లకు రెండవ దశలో కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు అతని ఆరోగ్యం మెరుగుపడడానికి వైద్యుల సలహా మేరకు నిరుపేదలైన జర్నలిస్టులకు అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇవ్వడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఇంకా ఏదో ఒక రూపంలో కరోనా కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ సంకల్పమని, ముఖ్యంగా మన్య ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడం, వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో నిర్వహిస్తున్న ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి జర్నలిస్ట్ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, అందుకు గాను వైద్య శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా ఆధార్ కార్డు జేరాక్స్ తీసుకుని రావలసిందిగాఆయన విజ్ఞప్తి చేశారు.
0 Comments