*అంబేద్కర్ విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చి జగనన్న విదేశీ విద్య అను పేరు పెట్టడం పిచ్చి పరాకాష్టకు చేరడం కాదా..?
*హెల్త్ యూనివర్శిటికి ఎన్టీయార్ పేరు కొనసాగించాలి
పాడేరు(వి. డేవిడ్): ఎన్టీయార్ ను అవమానపరచడమంటే తెలుగుజాతిని అవమానపరచడమే..?అని ప్రస్తుతం ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని, పార్టీలకు అతీతంగా దేశదేశాలలోని తెలుగువారందరూ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారని పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బుధవారం ఒక ప్రకటనలో స్థానిక విలేకరులకు తెలిపారు. ఆ ప్రకటనల వారు మాట్లాడుతూ 1986లో ఎన్టీయార్ హెల్త్ యూనివర్శిటీని స్థాపించారని, 1998లో చంద్రబాబు నాయుడు గ హెల్త్ యూనివర్శిటికి ఎన్టీయార్ పేరు పెట్టి గౌరవించారన్నారు. హెల్త్ యూనివర్శిటి నిధులు రూ.400 కోట్లు జగన్ రెడ్డి వై.యస్.రాజశేఖర్ రెడ్డి పేరు హార్టికల్చర్ యూనివర్శిటీకి పెట్టారన్నారు.కడప జిల్లాకు వైయస్ పేరు పెట్టారు. అయినా టీడీపీ ప్రభుత్వం ఆ పేర్లు మార్పు చేయలేదన్నారు.ఎన్టీయార్ ఒక పార్టీ ఆస్తికాదని జగన్ రెడ్డి, వైకాపా నేతలు చెప్పారన్నారు. మరి ఇప్పుడు ఎన్టీయార్ పేరు మార్చి వై.యస్ పేరు పెట్టడం ఉన్మాదం కాదా..? అంబేద్కర్ విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చి జగనన్న విదేశీ విద్య అను పేరు పెట్టడం పిచ్చి పరాకాష్టకు చేరడం కాదా..? ఎన్టీయార్ ఒక రాజకీయ నాయకుడే కాదు, సంఘ సంస్కర్త - దేవాంశ సంబూతునిగా తెలుగు ప్రజలు భావిస్తున్నారన్నారు. సంక్షేమ సారధి - సామాజిక న్యాయ ప్రధాత - మహిళా యూనివర్శిటీ స్థాపించారన్నారు. తిరుపతిలో స్విమ్స్, బర్డ్ హస్పటల్ స్థాపించారని,తిరుపతిలో నిత్యాన్నదానం ప్రవేశపెట్టారు. తెలుగు గంగ, గాలేరు-నగరి,హంద్రీనీవా ప్రారంభించారన్నారు. చంద్రబాబు హైదరాబాద్లో బ్రహ్మానందరెడ్డి పార్క్ పెట్టారని,సంజీవరెడ్డి విగ్రహం పెట్టారు. దామోదరం సంజీవయ్య పార్కు, మర్రి చెన్నారెడ్డి మానవవనరులు సెంటర్ పెట్టారన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పెట్టారని, ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని తెలుగు వారి ఆకాంక్ష, ఆలాంటి తెలుగు వైభవప్రతీక ఎన్టీయార్ని జగన్ రెడ్డి అవమాన పరచడం ద్వారా జగన్ రెడ్డి చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోతారన్నారు. జగన్ రెడ్డి తన దోపిడి, ఆరచకాలు, మోసాలు నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి ప్రాంతీయ, కుల చిచ్చుకు కుట్రలు చేస్తున్నారన్నారు.జగన్ రెడ్డి ఈ దుశ్చర్యను పార్టీలకు అతీతంగా తెలుగువారందరూ ఖండిస్తున్నారని, జగన్ రెడ్డి తన తప్పుడు నిర్ణయాన్ని ఉపసంహరించుకొకపోతే తెలుగు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పక మారారని అన్నారు. చారిత్రక పురుషుల్ని అవమానిస్తున్న జగన్ రెడ్డి తప్పుడు నిర్ణయం ఉపసంహరించుకోవాలని, హెల్త్ యూనివర్శిటికి ఎన్టీయార్ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
0 Comments