పాడేరు(వి.డేవిడ్): హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయాలని పిలుపు ఇవ్వడంతో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గబ్బడ సింహాచలం, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పాడేరు స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కడప జిల్లాకు వైయస్ పేరు పెట్టారు. అయినా టీడీపీ ప్రభుత్వం ఆ పేర్లు మార్పు చేయలేదన్నారు. ఎన్టీయార్ ఒక పార్టీ ఆస్తికాదని జగన్ రెడ్డి, వైకాపా నేతలు చెప్పారన్నారు. మరి ఇప్పుడు ఎన్టీయార్ పేరు మార్చి వై.యస్ పేరు పెట్టడం ఉన్మాదం కాదా..? అంబేద్కర్ విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చి జగనన్న విదేశీ విద్య అను పేరు పెట్టడం పిచ్చి పరాకాష్టకు చేరడం కాదా..? ఎన్టీయార్ ఒక రాజకీయ నాయకుడే కాదు, సంఘ సంస్కర్త - దేవాంశ సంబూతునిగా తెలుగు ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎన్టీయార్ని భారతరత్న ఇవ్వాలని తెలుగు వారి ఆకాంక్ష-ఆలాంటి తెలుగు వైభవప్రతీక ఎన్టీయార్ను జగన్ రెడ్డి అవమాన పరచడం ద్వారా జగన్ రెడ్డి చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోతారన్నారు. జగన్ రెడ్డి తన దోపిడి, ఆరచకాలు, మోసాలు నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి ప్రాంతీయ, కుల చిచ్చుకు కుట్రలు చేస్తున్నారన్నారు.హెల్త్ యూనివర్శిటికి ఎన్టీయార్ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు,తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్ ,ఎస్ట్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గబ్బడ సింహాచలం, పాడేరు నియోజకవర్గం బీసీ సెల్ కార్యదర్శి రొబ్బి రాము, డప్పోడవెంకట రమణ (బుజ్జి),బర్సింగి, శ్రీనివాసరావు, సరమండ సుమన్, (టి ఎన్ ఎస్ ఎఫ్)డప్పోడి కల్యాణం, కుడుముల కొటేశ్వరరావు,చంటి బాబు, సింహాచలం,బాబాజి తదితరులు పాల్గొన్నారు.
0 Comments