గూడెంకొత్త వీధి- చింతపల్లి ప్రధాన రహదారి అంతర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అనపర్తికి చెందిన ఓ వ్యాపారి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, అనపర్తికి చెందిన దుర్గా ప్రసాద్ రెడ్డి చింతపల్లి, జీకేవీధి మండలాల్లో గృహోపకరణలు వాయిదా పద్దతిలో విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు. శనివారం వ్యాపార నిమిత్తం జీకేవీధి వెళ్లిన దుర్గా ప్రసాద్ రెడ్డి ద్విచక్రవాహనంలో చింతపల్లికి వస్తున్నాడు. అంతర్ల గ్రామం వద్ద ఆకస్మికంగా పందుల గుంపు ద్విచక్రవాహనానికి అడ్డంగా రావడంతో అతడు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన వ్యాపారిని 108 లో చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు బాధితుడు తలకు బలమైన గాయమైందని వైద్యులు తెలిపారు.
0 Comments