జీకేవీధి పార్వతి, పరమేశ్వరులు ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

గూడెంకొత్త వీధి, మార్చి 5 : 
మండల కేంద్రం పార్వతి, పరమేశ్వరుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జాతర ముగింపును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, హోమం, కుంకుమ పూజలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. రాత్రి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి .ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శిలు మెట్టడం ప్రేమ్, సురేష్ కుమార్, గ్రామ పెద్దలు సాగిన ధర్మనపడాల్, జర్త బాలరాజు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments