చింతపల్లిలో ఐటీడీఏ, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేయాలి జెడ్పీ చైర్ పర్సన్ కి వినతి

జెడ్పీ చైర్ పర్సన్ కి వినతి పత్రం అందజేస్తున్న ఎంపీపీ వంతల బాబూరావు, జెడ్పీటీసీ సభ్యుడు బాలయ్య

చింతపల్లి, మార్చి 5
సబ్ డివిజన్ కేంద్రంలో ఐటీడీఏ, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేయాలని జెడ్పీ చైర్ పర్సన్ సుభద్రకి వినతి పత్రం అందజేసినట్లు స్థానిక ఎంపీపీ వంతల బాబూరావు, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో జెడ్పీ చైర్ పర్సన్ ని కలిసిన ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ చింతపల్లికి సుదీర్ఘ చరిక ఉందన్నారు. బ్రిటీష్ పాలకులు చింతపల్లి కేంద్రంగానే పరిపాలన సాగించారన్నారు. చింతపల్లి నియోజక వర్గం పాడేరులో విలీనం చేయడం వల్ల అభివృద్ధిలో వెనుక బడిందన్నారు . పాడేరు జిల్లా కేంద్రంగా ప్రకటించడం వల్ల చింతపల్లిలో ఐటీడీఏ, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేయాలని ఆమె కోరగా, ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళతామని ఆమె హామి ఇచ్చిందన్నారు. 

Post a Comment

0 Comments