డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం: ప్రిన్సిపాల్ బ్రహ్మచారి

చింతపల్లి, మార్చి 5:
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2022-28 విద్యాసంవత్సరంలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ బ్రహ్మచారి అన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కళాశాలలో ఆంగ్లం, కంప్యూటర్ అప్లికేషన్, హార్టికల్చర్, టూరిజం, ట్రావెల్ మేనేజ్మెంట్లో ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉందన్నారు. వివిధ పాఠ్యాంశాల్లో పోస్టు గ్రాడ్యుషన్లో 55 శాతం మార్కులు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఏపీసెట్, యూజీసీ నెట్, పీహెచ్ డీ చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు.

Post a Comment

0 Comments