అల్లూరి సీతారామరాజు జిల్లాను చింతపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయాలని వైసీపీ మాజీ మండలాధ్యక్షుడు అడపా విష్ణుమూర్తి అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ పరిపాలన అధికారికి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విష్ణుమూర్తి మాట్లాడుతూ, చింతపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయడం వల్ల రంచోడవరం ప్రాంత ప్రజలకు ప్రయాన భారం కొంత తగ్గుతుందన్నారు. అలాగే 1500 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు పరిపాలన సౌలభ్యన్ని దృష్టిలో పెట్టుకుని చింతపల్లి కేంద్రం నూతన జిల్లా ఏర్పాటు చేయాలని వినతి పత్రం ద్వారా కోరడమైందన్నారు.
0 Comments