చింతపల్లి ఆర్ఎఆర్ఎస్ ఏడీఆర్‌గా అనురాధ

చింతపల్లి ఫిబ్రవరి 8: స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు (ఏడీఆర్) గా డాక్టర్ టి.అనురాధ నియమితులయ్యారు. రెండు నెలల క్రితం స్థానిక ఏడీఆర్ డాక్టర్ గుత్తా రామారావు డీన్ గా పదోన్నతి పొందడంతో అనకాపల్లి ఏడీఆర్ డాక్టర్ ఎం. భరతలక్ష్మికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా పెద్దాపురం వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి టి.అనురాధను చింతపల్లి ఏడీఆర్ గా పదోన్నతి కల్పిస్తూ ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు డాక్టర్ అనురాధ మంగళవారం ఏడీఆర్ డాక్టర్ ఎం. భరతలక్ష్మి నుంచి బాధ్యతలు స్వీకరించారు.

Post a Comment

0 Comments