గిరిజన ప్రాంతానికి క్రైస్తవ సువార్తను తీసుకొచ్చిన తొలి బాప్టిస్ట్ మిషనరి పాస్టర్ స్వామినాథం: ఆదివాసీ ప్రభావిత పథం సీనియర్ పాస్టర్ డి.ఈనక్

కేక్ ని కట్ చేస్తున్న సీనియర్ సర్పంచ్, నాటి చర్చి నిర్మాణ సహకారి సాగిన నడిపి పదాల్,  పాస్టర్ ఈనక్, సోమరాజు

చింతపల్లి, జనవరి 6: గిరిజన ప్రాంతానికి క్రైస్తవ సువార్తను ప్రప్రథంగా  బాప్టిస్ట్ మిషనరి, పాస్టర్ డి. స్వామినాథం తీసుకొచ్చారని ఆదివాసీ ప్రభావిత పథం సీనియర్ పాస్టర్ డి. ఈనక్ తెలిపారు. గురువారం చింతపల్లిలో ప్రథమ చర్చి 60 వ వార్షికోత్సవాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాస్టర్ డి.ఈనక్ మాట్లాడుతూ 1948 లో చింతపల్లి ప్రాంతానికి తొలిసారిగా వచ్చిన పాస్టర్ డి. స్వామినాథం వచ్చారన్నారు. గిరిజన ప్రాంతంలో యేసు క్రీస్తు సువార్త చేపట్టాలని తలంచిన పాస్టర్ డి. స్వామినాథం 1950లో చింతపల్లి ప్రాంతానికి రావడం జరిగిందన్నారు. పాస్టర్ స్వామినాథం చింతపల్లిలో 1962 జనవరి 6 న స్థానికుల సహకారంతో గడ్డితో నిర్మించిన చర్చిని ప్రారంభించారన్నారు. నాటి చర్చిని ఆధునీకరించుకుని స్థానిక క్రైస్తవులు ప్రార్థనలు జరుపుకుంటున్నారన్నారు. పాస్టర్ స్వామినాథం 2010 లోనూ, ఆయన సతీమణి మేరిక్రిష్టియాన 2015 లో మరణించారన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ చర్చి వార్షికోత్సవాన్ని తొలిసారిగా సంఘ సభ్యులు, పాస్టర్లు నిర్వహించారన్నారు. ఈవిధంగా నాటి చరిత్రను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం కలిగిందన్నారు. అనంతరం సీనియర్ సర్పంచ్ సాగిన నడిపి పడాల్ కేక్ ని కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంతల బాబూరావు, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, సర్పంచ్ దురియా పుష్పలత, మాజీ ప్రజాప్రతినిధులు కల్యాణి, కంకిపాటి వీరన్నపడాల్, సాగిన దేవుడమ్మ, సీనియర్ పాస్టర్ వి. సోమరాజు, పాస్టర్ డి. డేవిడ్, సంఘ పెద్దలు అశోక్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎల్. యేసురత్నం, వసుపరి శామ్యుల్, ముర్ల వెంకట రమణ, టిడిపి నాయకులు రీమల ఆనంద్ చింతపల్లిలో వివిధ చర్చీలకు చెందిన పాస్టర్లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments