చింతపల్లి జనవరి 25(జయానంద్):
సబ్ డివిజన్ కేంద్రం బీసీ వెల్ఫేర్ బాలికల వసతి గృహానికి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కృషి ఫలితంగా రక్షిత మంచినీటి పథకం మంజూరైంది. మంగళవారం ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు నిర్మాణ పనులను ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. జనవరి ఒకటవ తేదీన బీసీ వెల్ఫేర్ బాలికల వసతి గృహంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు ఎదుర్కొంటున్న దయనీయ స్థితి గతులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం మాజీ మంత్రివర్యులు విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యలను విశాఖ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణు గోపాల కృష్ణ దృష్టికి తీసుకుని వెళ్లారు. వసతి, మంచినీరు, మరుగుదొడ్లు ఇతర సదుపాయాలు కల్పించాలని మాజీ మంత్రివర్యులు కోరడం జరిగింది. వెంటనే స్పందించిన జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చింతపల్లి బిసి వెల్ఫేర్ వసతి గృహానికి రక్షిత మంచినీటి పథకం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్ డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో బోర్వెల్ నిర్మాణం ప్రారంభించారు. అలాగే బోర్వెల్, మోటార్, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి విద్యార్థులకు తాగునీరు, రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పిస్తామని ఆర్ డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
0 Comments