డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళి

పాడేరు డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఐటిడిఏ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల క్రిష్ణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రపంచానికే ఆదర్శమన్నారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలు, భావాలు ఆచరణీయమని ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. నడిచే విశ్వవిద్యాలయంగా అభివర్ణించారు. ఈకార్యక్రమంలో పంచాయతీరాజ్ (పిఐయు) ఈఈ కె. శ్రీనివాసరావు, పిఆర్ఈఈ కె.మాలకొండయ్య, డిఈఈ నరేన్ కుమార్, ఐటిడి ఏఎఎఓ, శ్రీనివాస్ కుమార్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఎపిడి జె.గిరిబాబు, డిడి కార్యాలయం సూపరిండెంట్ శ్రీనివాస రెడ్డి, ఐటిడిఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments