ఐటిడిఏ పిఓను కలిసిన శిక్షణ ఐఏఎస్ లు

ఐటీడీఏ పీవో గోపాల క్రిష్ణ తో ట్రైనీ ఐఏఎస్ లు
పాడేరు(వి.డేవిడ్) డిసెంబరు 27: భారత్ దర్శన్ లో భాగంగా రెండు రోజుల నుంచి ఏజెన్సీలో పర్యటిస్తున్న 2020 బ్యాచ్ కు చెందిన 14 మంది శిక్షణ లోనున్న ఐఎఎస్ ల  బృందం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాల క్రిష్ణ ను సోమవారం  కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ఐటిడిఏ పరిధిలో గిరిజనాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి  వివరించారు. విద్య, వైద్య రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలియజేశారు. ఇటీవల నిర్వహించిన హేబిటేషన్ సర్వే, జనాభా, ఏజెన్సీలో ఉన్న గిరిజన తెగలు, జీవన విధానంపై వివరించారు. కాఫీ సాగు కాఫీ, రైతులకు మ్యాక్స్, గిరిజన సహకార సంస్థ ద్వారా అందిస్తున్న గిట్టుబాటు ధరల గురించి తెలియ జేశారు. గిరిజనులకు మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య, రవాణా, రహదారి సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి గల అధికారాలను తెలియ జేశారు. ఆంధ్రా ఊటీగా విశాఖ మన్యం ప్రసిద్ధి కెక్కిందన్నారు. పాడేరు మండలం వంజంగి, చింతపల్లి మండలం తాజంగి, అరకు వ్యాలీ, జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం, డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు తదితర పర్యాక ప్రాంతాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వి. అభిషేక్ , 14 మంది శిక్షణ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments