కోటవురట్ల, డిసెంబరు 6:ఆధునిక సేద్య పద్ధతులు పాటిస్తే ఉద్యాన పంటల్లో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చునని వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం బిఎస్సీ హార్టీకల్చర్ విద్యార్థులు వాడకాని సాయి కుమార్, రేష్మ అన్నారు. సోమవారం మండలంలోని జల్లూరు ఆర్ బీకేలో గ్రామీణ ఉద్యాన కృషి అవగాహన, అనుభవ కార్యక్రమంలో భాగంగా ఉద్యాన పంట సాగుపై రైతులకు చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యాన పంటల సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించడం వల్ల అధిక లాభాలు సాధించవచ్చునన్నారు. పంటలను ఆశించే తెగుళ్లు, చీడపీడలను సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సేంద్రీయ పద్ధతిలో సాగుచేసే ఉద్యాన పంటలకు మార్కెట్లో అధిక ధర లభిస్తుందన్నారు. పంటల్లో కలిగే మార్పులను ఉద్యానశాఖ అధికారులు, గ్రామ ఉద్యాన సహాయకుల దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో విశ్వవిద్యాలయం విద్యార్థి లీల పాల్గొన్నారు.
0 Comments