చింతపల్లి: స్థానిక ప్రథమ శ్రేణి జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈనెల 11 న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు న్యాయమూర్తి రెడ్డి ప్రసన్న తెలిపారు. శుక్రవారం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ .. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి అవకా
శమన్నారు. కొయ్యూరు, మంప, సీలేరు, జీకేవీధి, చింతపల్లి,అన్నవరం స్టేషన్లలో మెజారిటీ కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకునేలా పోలీసు అధికారులు కృషి చేయాలన్నారు. లోక్ అదాలత్ పై కేసులను ఎదుర్కొంటున్న ఇరుపక్షాలకు పోలీసులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏలు, ఎంఎస్ సీ రికార్డు అసిస్టెంట్ ఆశ, వలంటీర్లు క్రిష్ణ, హేమలత పాల్గొన్నారు.
0 Comments