పాడేరు(డేవిడ్.వి):ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఐటీడీఏ అధికారులు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఐటీడీఏ లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి సమీకృత గిజిజనాభివృద్ధిసంస్థ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల క్రిష్ణ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పిఓ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు ఫలితంగా రాష్టం ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించామన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ కుమార్, పరిపాలనాధికారి శ్రీనివాస కుమార్, కె.నాగేశ్వరరావు, డిఎస్ఓ ఎల్.అప్పారావు ఐటీడీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తెలుగు తల్లి చిత్ర పటానికి పూల మాల వేస్తున్న సబ్ కలెక్టర్ వి.అభిషేక్.
0 Comments