బుధవారం చింతపల్లిలో మెగా రక్తదాన శిబిరం..విజయవంతం చేయండి: వీరేంద్ర డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుడు వీరేంద్ర కుమార్

చింతపల్లి(అన్వేషణ అప్ డేట్) : రాజకీయ పార్టీల నాయకులు ప్రజా ప్రతినిధులు, అధికారులు,  వివిధ శ్రామిక వర్గాల, అన్ని రంగాల ప్రజల సహకారంతో ఈనెల 27న చింతపల్లి కేంద్రంగా నిర్వహించ తలపెట్టిన రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని వీరేంద్ర డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకుడు సుర్ల వీరేంద్ర కుమార్, సమన్వయకర్త ఎంఎస్ఏన్ మూర్తి  అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా కోవిడ్ వ్యాప్తి కారణంగా బ్లడ్  బ్యాంకుల లో రక్త నిల్వలు తగ్గడం,  రక్తం అవసరాలు  కూడా బాగా పెరిగాయన్నారు. ఇందుకుగాను మన వంతు సహాయంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించ తల పెట్టామన్నారు. ఈ కార్యక్రమాన్ని చింతపల్లి లోని ప్రతి ఒక్కరి సహకారం, సమన్వయంతో అత్యధిక సంఖ్యలో పాల్గొనే విధంగా రక్త దాతలను ఆహ్వానిస్తున్నట్లు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు ఉద్యోగ, కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్య, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంఘాలతో పాటు అధిక సంఖ్యలో యువత ముందుకు వచ్చి కార్యక్రమం విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

Post a Comment

0 Comments