పాడేరు(వి.డేవిడ్): పాడేరు ఏడీఎం హెచ్ వోగా లీలా ప్రసాద్ పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రజారోగ్య,
కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు గీతా ప్రసాదిని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఏడీఎంహెచ్ వో సురేఖ శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఈమె నెల రోజుల ముందు పాడేరు ఏడీఎంహెచ్ వోగా బదిలీ పై వచ్చారు. లీలాప్రసాద్ ప్రస్తుతం కేజే పురం ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పని చేస్తున్నారు. ప్రస్తుత ఏడీఎం హెచ్చ సురేఖ పాడేరు రాకముందు ఆయన ఇన్ ఛార్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
0 Comments