బుధవారం చింతపల్లి వారపు సంత పునఃప్రారంభం:సర్పంచ్ దురియా పుష్పలత

చింతపల్లి:
స్థానిక వారపు సంత బుధవారం నుంచి పునర్ ప్రారంభించినట్టు చింతపల్లి సర్పంచ్ దురియా పుష్పలత తెలిపారు. సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా, రెండు నెలలుగా చింతపల్లి వారపు సంత ను రద్దు చేయడం జరిగిందన్నారు . బుధవారం వారపు సంత రోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించేవారన్నారు. వర్తకులు, ప్రజల అభ్యర్థన మేరకు  తిరిగి వారపు సంత ప్రారంభిస్తున్నామని ఆమె తెలిపారు. అయితే దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తెరవాలని ఆమె స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments